‘కీచకుడి’ భార్యకు భాజపా టికెట్

‘కీచకుడి’ భార్యకు భాజపా టికెట్

ఉన్నావ్: ఉన్నావ్ లో అత్యాచారానికి పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న భాజపా మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యను పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ అభ్య ర్థిగా ఎంపిక చేయటం చర్చనీయాంశమైంది. సెంగార్ను పార్టీ నుంచి బహిష్కరించి సరిగ్గా ఏడాదిన్నరయిన తర్వాత మళ్లీ ఇప్పుడు ఆయన భార్య బీజేపీ తరపున పోటీ చేయ నున్నారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలడంతో 2019 డిసెంబర్ 20న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. తాజాగా ఆయన భార్య సంగీత సెంగార్కు ఉన్నావ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఫాతేపూర్ చౌరాసీ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. 2016లో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా గెలుపొందడం గమనార్హం. సంగీత సెంగార్కు పార్టీ టికెట్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ సమర్థించుకున్నారు.‘సుదీర్ఘ చర్చల అనంతరం కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు బీజేపీ టికెట్ ఇచ్చారని భావిస్తు న్నాను. ఉన్నావ్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆమె పనిచేస్తున్నారు. ఆమెకు ప్రజాదరణ ఉందోలేదో చూడాలి తప్ప… నేరస్తుడి భార్య కాబట్టి పట్టించు కోకుండా వదిలేయ కూడద’ని బీజేపీ ఎంపీ, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ శివ ప్రతాప్ శుక్లా విలేఖరులు అడిగిన బదులుగా చెప్పారు. ‘కుల్దీప్ సింగ్ తప్పు చేశారు కాబట్టి ఇవాళ ఆయన జైల్లో ఉన్నారు. కుల్దీప్ చేసిన నేరాలకు అతడి భార్యను శిక్షించకూడద’ని సమర్థించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos