ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు..

ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు..

దేశంలో విత్తన అవసరాలను 60 శాతానికి పైగా తీర్చుతూ సీడ్‌ ఆఫ్‌ బౌల్‌గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిఉన్న తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది.విత్తన ఉత్పత్తలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించిన ఆఫ్రికా ప్రతినిధుల బృందం సోమవారం తెలంగాణ వరి విత్తనాలపై అధ్యయనం చేయడంతో పాటు తమ దేశాలకు దిగుమతి చేసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చింది.పలు విషయాలపై అధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో విత్తనాల అధ్యయనం,దిగుమతులకు సంబంధించి ఒప్పందాలు కుదర్చుకున్నారు.అనంతరం కమిషనర్‌ పార్థసారధి మాట్లాడుతూ..గత ఏడాది సూడాన్‌,రష్యా,టాంజానియా,ఫిలిప్పీన్స్‌ దేశాలకు విత్తనాలు ఎగుమతి చేసామని ఈ ఏడాది మరో వెయ్యి టన్నుల విత్తనాలు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.అనంతరం ఆఫ్రికా ప్రతినిధుల బృందం మాట్లాడుతూ..ఆఫ్రికాలతో విత్తనాల నాణ్యత,దిగుబడి రెండూ తక్కువగానే ఉన్నాయని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విత్తనాలు దిగుమతి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం విత్తనాలను క్షుణ్ణంగా పరిశీలించామని ఈ విత్తనాల వల్ల దిగుబడి అధికంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు.సీడ్‌ విలేజ్‌ కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేస్తూ నాణ్యమైన విత్తనాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకోవడంతో పాటు విదేశాలకు విత్తనాలు ఎగుమతి చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.వరి,వేరుశణగ,మొక్కజొన్న,సోయాబిన్‌ తదితర పలు రకాల హైబ్రిడ్‌ విత్తనాలను 90 శాతం వరకు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.అన్నికంటే ముఖ్యంగా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా,వనరుల పరంగా అనుకూలంగా ఉండడంతో దేశవిదేశాలకు చెందిన సుమారు 400 కంపెనీలు తెలంగాణలోనే విత్తనోత్పత్తి,అధ్యయనం,ఎగుమతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos