కుమారస్వామి, సిద్ధరామయ్యపై రాజద్రోహం కేసు

కుమారస్వామి, సిద్ధరామయ్యపై రాజద్రోహం కేసు

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్య మంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నగర పోలీసులు రాజద్రోహం కేసు దాఖలు చేసారు. గత మార్చి 27న అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి, అప్పటి ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు తదితరులు క్వీన్ రోడ్డులోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ఎదుట నిరసన చేసారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులకు వ్యతిరేకంగా దీన్ని చేసారు. అదాయపు పన్ను శాఖ అధికార్లు భాజపా ఏజెంట్లు అని నినాదాలు చేశారు. దీన్నిమల్లికార్జున అనే వ్యక్తి స్థానిక న్యాయ స్థానంలో ఫిర్యాదు చేసారు. ఐటీ దాడులపై అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి తమ పార్టీ నేతలకు ముందే సమాచారాన్ని అందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందు వల్లే సోదాలకు వెళ్లిన ఐటీ అధికారుల్ని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. మల్లికార్జున ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ఆందోళన కార్లుపై రాజ ద్రోహ నేరారోపణను నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని మాజీ మంత్రి శివకుమార్ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి అవసరమైతే జైలుకైనా వెళ్తామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos