పిల్లలేమో బడికా? పెద్దలకేమో ఇంటి నుంచి పనా?

పిల్లలేమో బడికా? పెద్దలకేమో ఇంటి నుంచి పనా?

న్యూ ఢిల్లీ : పాఠశాలలను పున:ప్రారంభించడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దలేమో ఇంటి నుంచి పనిచేస్తుంటే.. పిల్లలను స్కూల్ కు పంపిస్తారా? అని ఢిల్లీ సర్కారు, అధికారులపై మండిపడింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం కాలుష్యంపై విచారించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ను అమలు చేసి, స్కూళ్లను మూసేసినట్టు ప్రభుత్వం చెప్పిందని, కానీ, తమకు అది కనిపించడం లేదని రమణ మండి పడ్డారు. ‘‘ప్రతి రోజూ అఫిడవిట్లు వేస్తూనే ఉన్నారు. నివేదికలు ఇస్తూనే ఉన్నారు. రోజూ ఏం జరుగుతోందో కమిటీలూ చర్చిస్తూనే ఉన్నాయి. సమయం వృథా అవడం తప్ప ఇప్పటిదాకా ఏం లాభం జరిగినట్టు? ఎన్ని చర్యలు తీసు కున్నా కాలుష్యం పెరుగుతూనే ఉంది’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలంటించారు. మూడు నాలుగేళ్ల పిల్లలు స్కూలుకు పోతుంటే.. వారి తల్లిదండ్రులేమో ఇంటి నుంచి పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలుకు వెళ్లడం వారి ఇష్టానికే వదిలేశామన్న ఢిల్లీ సర్కారు సమాధానానికి అసహనం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం