అనర్హతపై నిర్ణయాధికారం ఎవరిది?

అనర్హతపై నిర్ణయాధికారం ఎవరిది?

న్యూ ఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు నిర్ణయాధికారం ఎవరికి ఉండాలో పునరాలోచించాలని అత్యున్నత న్యాయ స్థానం మంగళ వారం పార్లమెంట్ను సూచించింది. ప్రస్తుతం ఈ అధికారం సభాపతికి ఉన్నప్పటికీ ఆయనా ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తే కదా అని వ్యాఖ్యానించింది.అందువల్ల ప్రజా ప్రతినిధుల అనర్హత నిర్ణయానికి స్వతంత్ర, శాశ్వత యంత్రాంగం ఏర్పాటు గురించి ఆలోచించాలని కోరింది. మణిపూర్ భాజపా మంత్రిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు అభిప్రాయపడింది. మణిపూర్ అటవీ శాఖ మంత్రి అయిన టీ.హెచ్. శ్యామ్కుమార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. తర్వాత భాజపాలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దరమిలా ఆయనపై అనర్హత వేటేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఫజూర్ రహీమ్, సీనియర్ నేత కె. మేఘచంద్ర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మా సనం శ్యామ్కుమార్పై అనర్హత పై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ శాసన సభా ప తి కి సూచించింది. గడువులోగా సభాపతి నిర్ణయాన్ని తీసుకోక పోయినపుడు తమ దృష్టికి తీసుకురావాలని సలహా ఇచ్చిం ది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos