కాలుష్య కారకులు ధనవంతులే

న్యూ ఢిల్లీ : ఢిల్లీ వాయు కాలుష్యంపై బుధ వారమూ సుప్రీం కోర్టు ప్రభుత్వం పై విరుచుకుపడింది. ‘‘ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు కాలుష్యానికి రైతులను నిందిస్తున్నారు . స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు కాలుష్యానికి కారణమవుతున్నారు. నిషేధం ఉన్నప్పటికీ పటాకులు కాల్చిన విషయాన్ని విస్మరిస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అనుమతి లేని ఇంధనాన్ని ఉపయోగించే పరిశ్రమలను మూసి వేయాలని ఢిల్లీ, ఇతర ఎన్సిఆర్ రాష్ట్రాల్లో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన వాటిలో 90 శాతం తామే చేశామని, పగలు, రాత్రి పెట్రోలింగ్తో తాము పరిశీలిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. గోధుమ పొట్టు తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos