బ్రెడ్లు తింటుంటే పేదరికమని తెలుసుకోలేకపోయా..

  • In Film
  • January 7, 2020
  • 166 Views
బ్రెడ్లు తింటుంటే పేదరికమని తెలుసుకోలేకపోయా..

సైకో పాత్రలతో,కరుడుగట్టిన విలనిజం పాత్రలతో,భిన్నమైన డైలాగ్‌ డెలవరీ మాడ్యులేషన్‌తో  తెలుగులో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నసత్యప్రకాశ్‌ తాజాగా తన బాల్య జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు.నేను దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మాది ఉమ్మడి కుటుంబం .. రెండే గదులు .. వాటిలో పదకొండుమందిమి ఉండేవాళ్లం.మా నాన్న ఒక్కరు మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. జీతం సరిపోకపోవడం వలన నాన్న అప్పులు చేస్తుండేవారు. అప్పుడప్పుడు అమ్మానాన్నలు అన్నం మాకు పెట్టేసి వాళ్లు బ్రేడ్ తినేవారు. మాకు బ్రెడ్ పెట్టడం లేదని అనుకునే వాళ్లమేగానీ, అది పేదరికమని తెలియని వయసు మాది. మా నాన్న సైకిల్ పై తిరుగుతుండటం చూసి ఎప్పటికైనా స్కూటర్ కొనగలమా అని అనుకునేవాడిని. అలాంటిది నేను కారు కొనే స్థాయికి వచ్చాను. దీనంతటికి భగవంతుడి అనుగ్రహం కారణమని నేను బలంగా భావిస్తానుఅని చెప్పుకొచ్చాడు.ఇక కెరియర్ తొలినాళ్లలో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.”సుమన్ .. భానుచందర్ .. అరుణ్ పాండ్యన్ హీరోలుగా చేస్తున్న ఒక సినిమాకి నన్ను తీసుకున్నారు. షూటింగుకి ముందు నాకు రెండు ఇడ్లీలుఒక వడ మాత్రమే పెట్టారు. అది నాకు సరిపోలేదు .. మరో ఇడ్లీ అడిగితే వేయలేదు. రోజున ఫైట్ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. దాంతో నన్ను బయటికి పంపించేశారు.  నా వెనుకే బయటికి వచ్చేసిన కో డైరెక్టర్ నన్ను ఒక తిట్టు తిట్టాడు. అది నన్ను గునపంలా గుచ్చుకుంది. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. తరువాత కొంత కాలానికి నేను నటుడిగా ఎదిగాను .. కో డైరెక్టర్ మాత్రం అలాగే వున్నాడు. ఒకసారి నాకు డైలాగ్ చెప్పడానికి నా దగ్గరికి వచ్చాడు. గతంలో నన్ను తిట్టిన విషయాన్ని కో డైరెక్టర్ కి గుర్తుచేశాను. ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చే వాళ్లను అలా అవమానించవద్దని గట్టిగానే చెప్పానుఅని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos