వైఎస్ జగన్ పై మరోసారి పోటీకి సై

రాజకీయంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో పచ్చ జెండా ఎగురవేగాయడినికి టీడీపీ ఇప్పటినుంచే కసరత్తులు ముమ్మరం చేసింది.గత జిల్లాలోని పది నియోజకవర్గాల పైకి రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే విహాయం సాధించిన టీడీపీ ఈసారి వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను
టీడీపీ ఖాతాలో వేసుకొని వైసీపీకి షాక్ ఇవ్వాలని భావిస్తోంది.అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముమ్మరం చేసారు.ముఖ్యంగా పులివెందులపై కన్నేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిగా సింగిరెడ్డి సతీష్ రెడ్డిని అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.దశాబ్దాలుగా సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటున్నారు.1999 నుంచి వరుసగా 2009 వరకు దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయారు.ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన అనంతరం అదే నియోజకవర్గం నుంచి వై ఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కూడా టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.అప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ గా ఉన్న సతీష్ రెడ్డి కి మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన చంద్రబాబు పదవీ కలం ముగియడంతో సతీష్ రెడ్డి కి పార్టీ బాధ్యతలు అప్పగించారు.కాగా కొద్ది కాలం క్రితం పులివెందుల కు నీరు ఇస్తేగానీ త‌న గ‌డ్డం తీయ‌న‌ని ప్ర‌క‌టించి.. కృష్ణ జలాలను పులివెందులకు తరలించిన అనంతరం త‌న శ‌ప‌ధం నెరవేర్చ‌కున్న సతీష్ రెడ్డి ఈసారి పులివెందులలో టీడీపీపై తమపై సానుకూల పవనాలు వీస్తున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా భావిస్తున్న టీడీపీ కూడా ఈసారి కూడా టీడీపీ తరపున సతీష్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డికి ప్రతిహర్తి గ బరిలో దించడానికి నిర్ణయంచుకున్నట్లు తెలుస్తోంది.20 ఏళ్లుగా పులివెందుల‌లో టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న స‌తీష్ రెడ్డి ఈ సారి బ‌లం చాటుకుంటార‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గం లో పార్టీ వ్య‌వ‌హారాల పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. మ‌రి..వైఎస్ కుటుంబానికి కంచు కోట‌గా ఉన్న పులివెందుల‌లో టిడిపి క‌ల‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేరుతాయో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos