మోదీకి కరోనా నివారణ కంటే కట్టడ నిర్మాణమే ముఖ్యం

మోదీకి కరోనా నివారణ కంటే కట్టడ నిర్మాణమే ముఖ్యం

ముంబై: కరోనాతో సతమతమవుతున్న భారత్కు సాయం అందించడానికి పేద దేశాలూ సిద్ధమవుతున్నా మోదీ ప్రభుత్వం మాత్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును రద్దు చేసేందుకు సిద్ధంగా లేదని శివసేన మండిపడింది. గత 70ఏళ్లలో నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి నేతలు నిర్మించిన వ్యవస్థ కారణంగానే ప్రస్తుత పరిస్థితులను దేశం ఎదుర్కోగలుగుతోందని పార్టీ పత్రిక- చెందిన సామ్నా లో వ్యఖ్యానించింది. “భారత్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఆ దేశాన్ని ఆదుకోవాలంటూ ఇటీవల యూనిసెఫ్ పేర్కొంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక దేశాలు భారత్కు సాయపడేందుకు సిద్ధమయ్యాయి. ఒకప్పుడు పాకిస్థాన్, కాంగో వంటి దేశాలకు ఈ పరిస్థితి ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల కారణంగా మనకూ ఇప్పుడు ఈ పరిస్థితి పట్టింది. ఈ సమయంలో కూడా రూ.20వేల కోట్లు విలువ చేసే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కొనసాగింపుపై ఎవరికీ చింత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంద’ని దుయ్యబట్టింది. ప్రపంచం కరోనా రెండో దశపై పోరాడుతుంటే. కేంద్రం మాత్రం ఇంకా బంగాల్ రాజకీయాలపైనే దృష్టి సారిస్తోందని విమర్శించింది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన ఉన్న ఏ ప్రభుత్వమైనా రాజకీయాల గురించి ఆలోచించదని, ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అఖిలపక్షాలతో కలిసి చర్చించేదని వ్యాఖ్యానించింది. ‘ఆరోగ్య శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీకి బాధ్యతలు అప్పజెప్పాలని భాజపా ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఇటీవల కేంద్రానికి సూచించారు. ప్రస్తుత ఆరోగ్య మంత్రి విఫలమయ్యారు అనడానికి ఇదే రుజువు’ అని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos