తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలి

న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు మద్దతుగా ఇటీవల తిరుగుబాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ బుధవారం డిమాండ్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ యూనిటీ వాక్ జరగనున్న నేపథ్యంలో పైలట్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”రాజస్థాన్లో పరిస్థితిని పరిశీలకులు సీరియస్గా తీసుకున్నారు. పార్టీ సైతం ఇది క్రమశిక్షణారాహిత్యమని చెప్పింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు చర్చలు తీసుకోవాల్సి ఉంది” అని పైలట్ అన్నారు. రాజస్థాన్లో క్రమశిక్షణారాహిత్యానికి ముగింపు పలకాల్సిన సమయం ఇదేనని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చాలా పాత పార్టీ. ఎవరెంత సీనియర్ అయినప్పటికీ అందరికీ ఒకే నిబంధన వర్తిస్తుంది. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సరైన చర్యతీసుంటారనే నమ్మకం నాకు ఉంది’ అని పైలట్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos