రష్యా టీవీలో ఇప్పుడు ఏం ప్రసారమవుతుందో చూడండి!

  • In Film
  • May 29, 2020
  • 135 Views
రష్యా టీవీలో ఇప్పుడు ఏం ప్రసారమవుతుందో చూడండి!

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి,గొప్పదనాన్ని ఖండాంతరాలు దాటించిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి మూడేళ్ల క్రితం విడుదలైన బాహుబలి ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడేళ్లు దాటుతున్న ప్రపంచ దేశాల్లోనే ఏదో ఒక దేశంపై బాహుబలి హంగామా ఏదో ఒక రోజు కనిపిస్తూనే ఉంది. బాహుబలి చిత్రం రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం, ఆ దేశ ఎంబసీ కీర్తించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ సినిమా రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.రష్యా టెలివిజన్‌లో బాహుబలి చిత్రం మే 28న ప్రసారమైంది. ఈ చిత్రాన్ని రష్యన్ భాషలోకి అనువాదం చేసి ప్రసారం చేయడం జరిగింది అని రష్యన్ ఎంబసీ ఫెడరేషన్ ఓ వీడియోను విడుదల చేసింది. రష్యన్ భాషలోకి అనువాదం అయిన భారతీయ సినిమాల్లో ఇది అరుదైన చిత్రమని ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ చిత్రానికి రష్యా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.రష్యాలో భారత చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొంది. “రష్యా టీవీలో ఇప్పుడు ఏం ప్రసారమవుతుందో చూడండి! రష్యా డైలాగులతో బాహుబలి!” అంటూ రష్యా ఎంబసీ ట్వీట్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos