దేవుణ్ని నమ్మిన రష్య

దేవుణ్ని నమ్మిన రష్య

మాస్కో:దైవం పట్ల విశ్వాసం, స్త్రీ-పురుషుల మధ్య జరిగే సంగమాన్ని మాత్రమే పెళ్లిగా గుర్తించేలా రష్యా ప్రభుత్వం తన రాజ్యాంగాన్ని సవరించనుంది. మొత్తం 24 పుటల సవరణల్ని అధ్యక్షుడు పుతిన్ పార్లమెంట్కు సమర్పించారు.సమాజంలోని అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ మార్పులకు చేసినట్లు సభాపతి వచస్లేవ్ వోలోడిన్ వెల్లడించారు. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్ట బద్దం చేసే ప్రసక్తే లేదని ఇటీవల పుతిన్ తేల్చి చెప్పారు.అమ్మ,నాన్న అన్న సాంప్రదాయ పద్ధతులను పేరెంట్ నెంబర్ వన్, పేరెంట్ నెంబర్ టుతో పోల్చలే మన్నారు. రష్యా చట్టం ప్రకారం కేవలం హెటిరోసెక్సువల్ దంపతులు మాత్రమే పిల్లలను దత్తత తీసుకునే వీలు ఉంది. రష్యాలో ఎక్కువ శాతం సాంప్రదాయ క్రిస్టియన్లు ఉన్నారు. ఆ దేశం సెక్యులర్ కూడా. రాజ్యాంగ సంస్కరణల బిల్లుపై మార్చి 10 న రెండో సారి చర్చించ నున్నారు. ఏప్రిల్ 22 న ఓటింగ్ జరగనుంది.

తాజా సమాచారం