20 తరువాత నిబంధనల సడలింపు

20 తరువాత నిబంధనల సడలింపు

తిరువనంత పురం: ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో నిర్బంధ( లాక్ డౌన్) నియామాల్నిసడలిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ‘సరి – బేసి’ సంఖ్యల ప్రాతిపదికన వాహనాలకు సంచార అనుమతి జారీ చేస్తామని చెప్పారు. ‘నిబంధనల సడలింపు పాక్షికంగానే ఉంటుంది. మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతినిస్తాం. రాష్ట్రాన్ని జిల్లాలను నాలుగు జోన్ లుగా విభజించాం. లాక్ డౌన్ ను అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరిన’ట్లు వివరించారు. గురువారం సాయంత్రానికి 394 కేసులు దాఖలయ్యాయి. 147 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 245 మంది చికిత్స అనంతరం విడుదలయ్యారు. ఇద్దరు వ్యాధితో మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos