విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో కూడా

అమరావతి: కేంద్ర విద్యా హక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలిపారు. సోమవారం ప్రజావేదిక భవనంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘నాకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటి. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత 33 శాతంగా ఉంది జాతీయ స్థాయి సగటు కన్నా ఇది ఎక్కువ. అందుకే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెడతాము. తెలుగును తప్పనిసరి విషయం చేస్తాము. విద్యార్థులకు ఏక రూప దుస్తులు, పుస్తకాలు సకాలంలో అందిస్తాం. పిల్లలకు బూట్లు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది. గత ప్రభుత్వంలో ఏకరూప దుస్తుల కొనుగోలులో అవినీతి జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడద’ ని విపులీకరించారు. ‘విద్య వ్యా పారం కాకూడదు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామ’ని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో విద్య అనేది సేవే కానీ ధనార్జ రంగం కాదని చెప్పారు. ఎవరు విద్యా సంస్థ లు పెట్టినా అది వ్యాపారం కాకూడదని దిశానిర్దేశం చేశారు. జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు ఉండడంతో పాటు కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos