ఆర్టీసీకి కార్మికుల సమ్మె నోటీసు

ఆర్టీసీకి కార్మికుల సమ్మె నోటీసు

అమరావతి : ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యానికి ప్రధాన కార్మిక సంఘం ఎన్‌ఎంయు బుధవారం సమ్మె నోటీసు ఇచ్చింది. మొత్తం 46 డిమాండ్లతో కూడిన నోటీసును ఎండీ సురేంద్రబాబు అందించారు. తమ డిమాండ్లను తీర్చకపోతే ఈ నెల 22 తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేస్తామని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు కూడా గురువారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. గత డిసెంబరులో నోటీసు ఇచ్చినప్పుడు డిమాండ్లను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే అవేవీ పరిష్కారం కాలేదు. యూనియన్‌ ప్రధాన డిమాండ్లు…ఆర్టీసీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.650 కోట్లు విడుదల చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఏటా కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి. కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos