సమ్మె బాటలో ఆర్టీసి సిబ్బంది

సమ్మె బాటలో ఆర్టీసి సిబ్బంది

విజయవాడ: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) సంస్థ యాజమాన్యానికి సమ్మె సూచన సమర్పించిన ఇచ్చిన 24 గంటల్లోనే ఎంప్లాయూస్ యూనియన్ తోసహా మరో 10 సంఘాలు సమ్మె హెచ్చరిక సూచనల్ని ఇచ్చాయి. వేతన సవరణ, బిల్లులు చెల్లింపు సహా 27 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐకాస నేతలు ఆర్టీసీ కార్యనిర్వహక సంచాలకుడు సురేంద్ర బాబుకు గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ నెల 22 లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలను నిలిపివేస్తామని ఆ తర్వాత విలేఖరులకు తెలిపారు. కార్మికులకు 40 శాతం వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీలో సిబ్బంది కుదించే చర్యలు, అద్దె బస్సుల సంఖ్య పెంచే ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండు చేసారు. సీసీఎస్కు చెల్లించాల్సిన రూ.285 కోట్లు వెంటనే చెల్లించాలని ఐకాస నేత దామోదర్ రావు కోరారు డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే కచ్చితంగా సమ్మె కడతామని తేల్చి చెప్పారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో సమ్మె సన్నాహక ధర్ణాల్ని నిర్వహిస్తామని ఐకాసా నేతలు వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos