నన్ను సాగనంపే కుట్ర

నన్ను సాగనంపే కుట్ర

న్యూ ఢిల్లీ : వైకాపా రాజ్య సభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తనను పార్టీ నుంచి సాగనంపేందుకు కుట్ర పన్నారని ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు రఘు రామ కృష్ణం రాజు ఆరోపించారు. శని వారం ఇక్కడ సభాపతి స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలను కలుసుకున్నతర్వాత విలేఖరులతో మాట్లాడారు. సోషల్ మీడియాను ద్వారా విజయసాయి రెడ్డి తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. ‘ముఖ్యమంత్రి జగన్ ను నేను పల్లెత్తు మాట అన లేదు. ఆయనకు అనుకూలమైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నా ప్రాణాలకు ముప్పు ఉన్నందున కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి చెప్పా. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని కోరా. నాకు వ్యతిరేకంగా ప్రవర్తించేలా, దాడులకు తెగబడేలా కుట్రలు చేస్తున్నారు. ‘అయ్యా విజయసాయిరెడ్డి గారూ… నేనొక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. క్రమశిక్షణ కలిగిన ఎంపీని. మీరు పత్రికల్లో నాపై ఎన్ని దొంగ రాతలు రాయించినా… ఆ దొంగ రాతలను చూశారా, చూశారా అంటూ పదేపదే చెప్పినా… నేను ఏ నాడు పార్టీని కానీ, పార్టీ అధినేత జగన్ ను కానీ వ్యతిరేకించ లేదు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నన్ను శిక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. జగన్ కు, నా మధ్య మనస్పర్థలు కలిగించవద్దు. వీలైతే మీరు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాల’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos