అవినీతి తహశీల్దార్ ఘటన వాళ్లందరికీ కనువిప్పు కావాలి..

అవినీతి తహశీల్దార్ ఘటన వాళ్లందరికీ కనువిప్పు కావాలి..

లంచం కేసులో అరెస్ట్ అయిన కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు.”కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా మంది లంచగొండు అధికారులకు కనువిప్పు కలగాలి. ప్రాణం కన్నా పరువు గొప్పదని, డబ్బు ఆశలో పడి ఆ పరువుని పణంగా పెట్టి అవినీతి చేస్తే ఆ జీవితానికి అర్ధం లేదని ఆయన చావు చెబుతుంది.డబ్బు ఉండాలి, కావాలి కూడా, కానీ సమాజంలో తలదించుకునే స్థాయిలో దానిపై వ్యామోహం సమాజంలో విలువ లేకుండా చేస్తుంది. నీతితో బ్రతికేవాడు ప్రతీరాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. దానికి మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ జీవితకాలంలో మనకు తినటానికి, ఉండటానికి, తిరగటానికి అవసరమైనదానితో తృప్తి పడటంలో ఉన్న ఆనందం ఇంకేదీ లేదు.” అని రాసుకొచ్చారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos