సేన-బీజేపీ సంబంధాలను అమీర్‌, కిరణ్‌రావుతో పోల్చిన రౌత్

సేన-బీజేపీ సంబంధాలను అమీర్‌, కిరణ్‌రావుతో పోల్చిన రౌత్

ముంబై: శివసేన-బీజేపీ సంబంధాలను అమీర్ఖాన్, అతని భార్య కిరణ్ రావు మధ్య నున్న సంబంధంగా శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అభివర్ణించారు. బీజేపీ-శివసేన శత్రువులు కారంటూ మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యకు సంజయ్ రౌత్ ఈ మేరకు స్పందించారు. ‘మేమేమీ ఇండియా, పాకిస్థాన్ కాదు. అమీర్ ఖాన్, కిరణ్ రావులను చూడండి. మా సంబంధం అలాంటిదే. ఎవరి రాజకీయ మార్గాలు వారివి. కానీ మిత్రత్వం ఎప్పటిలాగే ఉంటుంది” అని రౌత్ చెప్పారు. మహారాష్ట్రలోని అధికార మహా అఘాడి సర్కార్లో విభేదాలు వచ్చాయని, శివసేనకు బీజేపీ దగ్గరవుతోందని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న దశలో రౌత్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, తమ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు లేవని బీజేపీ ఖండించింది. ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంట్ పాటిల్ వివరణ ఇస్తూ, బీజేపీ-సేన శత్రువులు కారని ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు 100 శాతం నిజమేనని, అయితే దీని అర్ధం రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మాత్రం కాదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos