ఆ ఒక్క గుర్తు తెరాస కొంప ముంచింది..

ఆ ఒక్క గుర్తు తెరాస కొంప ముంచింది..

తెలంగాణ రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసినా తెరాస శ్రేణుల్లో విజయోత్సాహం కనిపించడం లేదు.అందుకు కారణం ఏడు నియోజకవర్గాల్లో ఓటమి పాలవడమే.అందులో కేసీఆర్‌ తనయురాలు కవితతో పాటు అత్యంత ఆప్తుడు వినోద్‌ కూడా ఉండడం తెరాస శ్రేణులకు తీవ్ర ఇబ్బంది పెడుతోంది.ఓటమికి కారణాలు విశ్లేషించుకున్న పనిలో పడ్డ తెరాసకు ఎన్నికల సమయంలో చేసిన పోరపాట్లు, నిర్లక్షం,వైఫ్యలం ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.ఈ క్రమంలో భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.కోమటిరెడ్డి విజయం సాధించడం వెనుక ఒక ఆసక్తికర అంశం వెలుగు చూసింది.లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి సింగపాక లింగం అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు.అయితే సింపాక లింగానికి కేటాయించిన రోడ్డురోలర్‌ గుర్తు తెరాస కారు గుర్తును పోలి ఉండడాన్ని తెరాస గమనించకుండా వదిలేసింది.తెరాస చేసిన ఈ చిన్న తప్పు ఎన్నికల్లో తెరాస అభ్యర్థినే ఓటమిపాలు చేసింది.స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ఈ గుర్తు గులాబీ కారును పోలిన రీతిలో ఉండటంతో.. నియోజకవర్గ పరిధిలోని పలువురు నిరక్ష్యరాసులు రోడ్డు రోలర్ గుర్తుకు ఓటు వేశారు. ఈ వాదన ఎంత నిజమన్నది ఆ గుర్తుకు వచ్చిన ఓట్లను చూస్తే అర్థమయ్యే పరిస్థితి.నల్గొండ ఎంపీ స్థానంలో రోడ్డు రోలర్ గుర్తుకు ఏకంగా 27973 ఓట్లు నమోదు కావటం గమనార్హం. బలమైన వామపక్ష పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లకు సమానంగా పడిన ఈ ఓట్లు మొత్తం  టీఆర్ ఎస్ కు పడాల్సినవిగా అంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి తన సమీప టీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిపై 5219 ఓట్లు తేడాతో విజయం సాధించారు. ప్రతి రౌండ్ లోనూ రోడ్డు రోలర్ గుర్తుకు కనీసం రెండు వేలకు తగ్గకుండా ఓట్లు పోల్ కావటం గమనార్హం. ఈ అంకెల్ని చూస్తే.. రోడ్డు రోలర్ నుకారుగా భావించిన పలువురు ఓటర్లు ఓట్లు వేయటంతో.. గులాబీ ఓట్లు చీలి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయానికి కారణంగా మారింది. మొత్తానికి రోడ్డు రోలర్.. గులాబీ కారును భారీగా దెబ్బేసినట్లు చెప్పక తప్పదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos