ఆంధ్రజ్యోతి కట్టడం తొలగింపునకు తాఖీదు

ఆంధ్రజ్యోతి కట్టడం తొలగింపునకు తాఖీదు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అనుమతులు తీసుకోకుండానే గాల్వాల్యం షీట్ భవనాన్ని నిర్మించారని గోదావరి డెవలప్ మెంట్ అథారిటీ (గుడా) తాఖీదులు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా 1.75 ఎకరాల విస్తీర్ణంలో రెండంతస్తులతో ఈ ప్రింటింగ్ ప్రెస్ ను నిర్మించారని గుడా తెలిపింది. నోటీసులు అందుకున్న వెంటనే ఈ భవనాన్ని తొలగించాలనీ, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు ఈ తాఖీదుల్ని జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారం లోగా స్పందించాలని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos