కొంతసేపైనా మందు అమ్మండి…ప్లీజ్

కొంతసేపైనా మందు అమ్మండి…ప్లీజ్

ముంబై : ప్రస్తుత విపత్కర సమయంలో మనిషి నిరాశలో కూరుకుపోయాడని, దాన్నుంచి బయటపడడానికి అతనికి మద్యం అవసరమని, వీలైతే బ్లాక్‌లో అయినా అమ్మాలని బాలీవుడ్ సీనియర్ హీరో రిషీ కపూర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యవసరాలు, మెడికల్ షాపులు మినహా మిగిలినవన్నీ బంద్ అయిపోయాయి. మద్యం దుకాణాలు కూడా మూతబడడంతో మందుబాబులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం దొరక్క కొందరు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషీ కపూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. `ప్రస్తుత సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం అవసరం. నిరాశలో కూరుకుపోయిన మనిషికి మద్యం అవసరం. తప్పుగా అర్థం చేసుకోకండి.. ఆలోచించండి.. లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను సాయంత్రం పూట కొంత సమయం తెరిస్తే బావుంటుంది. కావాలంటే బ్లాక్‌లో అయినా అమ్మండ`ని రిషి ట్వీట్ చేశారు. రిషి ట్వీట్‌కు పెద్ద ఎత్తున మద్దతు రావడం గమనార్హం.

తాజా సమాచారం