రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు చకచకా దూసుకుపోతున్నాయి.పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దూకిన ఈడీ, సుప్రీం కోర్టు ఆదేశాలతో ముంబై చేరుకొన్న సీబీఐ అధికారులు తమదైన శైలిలో దర్యాప్తు కొరడా ఝులిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుశాంత్ మరణంలో వాస్తవాలు బయటకు రాబట్టడానికి ముంబైలో సీబీఐ, ఈడీ అధికారులు సమావేశమయ్యారు.సుశాంత్ సింగ్ కేసులో మాదక ద్రవ్యాల అంశం కొత్తగా వెలుగు చూడటం మీడియాలో ఆసక్తి రేపింది. రియా డ్రగ్స్ ఎందుకు కొన్నారు? ఎంత మొత్తం కొన్నారు? ఎంత ఎన్నిసార్లు కొన్నారు అనే విషయాలను చెప్పడానికి దర్యాప్తు సంస్థలు నిరాకరించినట్టు తెలిసింది. రియా డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ చర్చకు దారి తీసింది. రియాకు డ్రగ్స్‌ దందాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంది.సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఖాతాల గురించి ఆరా తీశాం. బ్యాంకు అధికారులు, రియా చక్రవర్తి నుంచి వివరాలు సేకరించాం. వాటిని దర్యాప్తు కోసం సీబీఐ అధికారులకు అందించాం. ఆర్థికపరమైన వ్యవహారాలపై ఇరు దర్యాప్తు సంస్థల అధికారుల మధ్య కొంత చర్చ జరిగింది అని ఈడీ అధికారులు చెప్పినట్టు రిపబ్లిక్ కథనంలో పేర్కొంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos