రేవంత్‌ రెడ్డి కొత్త పార్టీ?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత పార్టీతో ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నా కూడా పార్టీలోని కొందరు సీనియర్లు రేవంత్‌ను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి పట్ల హైకమాండ్ చాలా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు.మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేసిన కేసులో రేవంత్ ని జైల్లో వేసినప్పుడు కూడా ఒక్క పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ..మిగిలిన ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత కూడా విషయం పై రియాక్ట్ అవ్వలేదు.ఎదో సంఘీభావం ప్రకటించాలి కాబట్టి ..ఎదో రెండు ముక్కలు చెప్పి ఉత్తమ్‌ సైతం మౌనం వహించారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలమైన పార్టీగా మార్చాలని రేవంత్ చేస్తున్నప్పటికీ ..పార్టీ నేతల మద్దతు లభించకపోవడంతో రేవంత్ కొంత అసహనంలో ఉన్నాడు. నేపథ్యంలోనే కొత్త ప్రాంతీయ పార్టీని ప్రారంభించడం వల్ల కలిగే లాభాలు నష్టాలు గురించి రేవంత్ ఇప్పటికే తన మద్దతుదారులు మరియు అనుచరులతో చర్చించారని తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశకు గురైందని టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా ముందు రావడం లేదు అని దీనితో ఆయనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే బలమైన ప్రాంతీయ పార్టీ అవసరం అని అయన తన అనుచరుల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటిస్తేఆయనకి తమ మద్దతు ప్రకటించడానికి అనేక మంది ఎన్నారైలు,తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ఆయన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చిమరో కొత్త పార్టీ ప్రకటిస్తే అయన పార్టీలో భారీగా చేరికలు ఉండవచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా రేవంత్ వర్గం ఉంది. వర్గం మొత్తం కాంగ్రెస్ కొత్త పార్టీలోకి జంప్ అవ్వచ్చు. దీంతోపాటు కాంగ్రెస్‌తో విసుగు చెందిన మరికొంత మంది కాంగ్రెస్‌ నేతలు కూడా రేవంత్ కే జై కొట్టే అవకాశం ఉంది. ఇక ఎలాగూ ..గతంలో తెదేపా పరిచయాలని ఉపయోగిస్తే ..టీడీపీ మాజీ నేతలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos