ప్రజావాణికి వచ్చిన మహిళకు లక్ష రూపాయలు ఇచ్చిన కేటీఆర్

ప్రజావాణికి వచ్చిన మహిళకు లక్ష రూపాయలు ఇచ్చిన కేటీఆర్

హైదరాబాదు:ప్రజావాణిలో ఓ మహిళ సమస్య పరిష్కారం కాలేదని… మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు మహిళకు రూ.1 లక్ష ఇచ్చారని, అంటే ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ప్రజావాణికి వచ్చి తన సమస్య చెప్పుకోవడంతో… అది తీరలేదని తెలిసి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. ఆమె ఇక్కడకు రాకుంటే సాయం అందకపోయి ఉండేదన్నారు. అయినా కేటీఆర్ ఇచ్చింది తన తన లక్ష కోట్ల రూపాయల సంపాదన నుంచి కేవలం ఒక లక్ష రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఎలా చూసినా ప్రజావాణి సక్సెస్ అయిందన్నారు. పదేళ్లపాటు కేటీఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారన్నారు. అసెంబ్లీలో కూడా బావాబావమరుదులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదని, అందుకే బయట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అంతా ఖాళీ చేసి పోయింది
బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో తెలంగాణను అంతా ఖాళీ చేసి పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. మేమేదో లంకెబిందెలు ఉన్నాయని భావిస్తే… వచ్చి చూస్తే ఖాళీ కుండలు కనిపించాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంతా ఊడిచిపెట్టి పోయారని.. ఈ పరిస్థితి నుంచి తేరుకొని ముందుకు సాగుతామన్నారు. అందుకే తాము కేంద్రం వద్దకు వెళ్లినట్లు చెప్పారు. తెలంగాణకు సంబంధించి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ తెస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకుంటామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos