అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు

అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు

హైదరాబాదు: తెలంగాణ సర్కారుపై ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ”దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి భూమి లేదు. గిరిజన విశ్వ విద్యాలయానికి భూమి లేదు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి భూమి ఉంది. ఎవని పాల యిం దిరో  తెలంగాణ… జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ” అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు.టీఆర్ఎస్ కు భూమి కేటాయించి జారీ చేసిన ఉత్వర్వును దీనికి జత పరిచారు. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం బంజారాహిల్స్లో 4,935 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర సర్కారు కేటాయించిందని, అది హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఉందని అందులో ఉంది. పాలమూరు నుంచి ప్రజల వల సలు ఆగట్లేదని కూడా మరో ట్వీట్ చేశారు. ”అయ్యాకొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగునపడ్డాయి. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి ఆస్కార్ ఇవ్వొచ్చు. పాలమూరు పచ్చబడ్డ దన్నది జూటామాట. సందేహం ఉంటే క్షేత్రానికి వెళ్లి నిజనిర్ధారణ చేద్దాం. వచ్చే దమ్ముందా కేటీఆర్!?” అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos