రిసెప్షనిస్ట్ హత్య..రిసార్ట్ కూల్చివేత ఆదేశం

రిసెప్షనిస్ట్ హత్య..రిసార్ట్ కూల్చివేత ఆదేశం

డెహరాడూన్ : హత్య కేసులో అరెస్టైన బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కు చెందిన రిసార్టును కూల్చివేయమని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదేశాలు జారీ చేశారు. నిందితులైన పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. సెప్టెం బర్ 18న రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న అంకితా భండారి అనే 19యేళ్ల యువతి కనిపించకుండా పోయింది. దీంతో అంతా వెతికిన ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వారం తరువాత హత్యకు గురైందన విషయాన్ని కనిపెట్టారు. శనివారం ఉదయం ఆమె మృతదేహాన్ని కాలువలో నుంచి బయటికి తీసారు. తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని, ఇందుకు సంబంధించిన ఆడియో సాక్ష్యం తమ వద్ద ఉందని బాధితురాలి తండ్రి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos