రిపబ్లిక్‌ టివి ఘన్‌శ్యామ్‌ సింగ్ అరెస్ట్‌

రిపబ్లిక్‌ టివి  ఘన్‌శ్యామ్‌ సింగ్ అరెస్ట్‌

ముంబయి : నకిలీ రేటింగ్ స్కాం కేసులో రిపబ్లిక్ టివి డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘన్శ్యామ్ సింగ్ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూస్ చానెల్స్తో పాటు వాటిలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ప్రజలు ఎక్కువమంది చూస్తున్నట్లుగా రేటింగ్ల్లో అవతవకలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఘన్శ్యామ్ను 12వ నిందితుడు. ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లిని ఆత్మ హత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ రిపబ్లిక్ టివి హెడ్ అర్ణబ్ గోస్వామిని గత వారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ టివిని చూడనప్పటికీ తమకు నగదు చెల్లించి మరీ ఆ చానెల్ చూస్తున్నట్లుగా చెప్పమన్నారని కొందరు సాక్ష్యమిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. టిఆర్పి స్కాంలో ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా ప్రాంతీయ చానెల్స్ కూడా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos