రుణ గ్రహీతలకు షాక్

రుణ గ్రహీతలకు షాక్

ముంబై : రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) బుధ వారం రెపో రేటును అర శాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న వారిపై మరింత భారం పడనుంది. ఈఎంఐలు పెరగ నుంది. నెల కిందట ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం మేర పెంచింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కీలక రేటును 0.90 శాతం పెంచటంతో రెపో రేటు 4.90 శాతానికి చేరింది. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. రూ.30 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే.. తాజా పెంపు తర్వాత ఈఎంఐ రూ.1,648 పెరగనుంది. అప్పుడు నెలవారీ ఈఎంఐ రూ.23,259 నుంచి రూ.24,907గా అవుతుంది. ఒకవేళ వాహన రుణం రూ.8 లక్షలను 7 ఏళ్ల కాలానికి 10 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుంటే.. నెల రోజుల్లో 0.90 శాతం పెరగడం వల్ల ఈఎంఐ రూ.375 పెరుగుతుంది. అలాగే, రూ.5 లక్షల వ్యక్తిగత రుణాన్ని 5 ఏళ్ల కాలానికి తీసుకున్నారని అనుకుంటే వడ్డీ రేటు 14 శాతం నుంచి 14.9 శాతానికి పెరగడం వల్ల ఈఎంఐ రూ.235 మేర పెరగనుంది. ఇక ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఒక శాతం వరకు పెరగ వచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos