రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి

రాకేశ్వర్‌సింగ్‌కు విముక్తి

బీజాపూర్: మావోయిస్టుల ఐదు రోజుల చెర నుంచి కోబ్రా కమాండో రాకేశ్వర్సింగ్కు గురువారం విముక్తి కలిగింది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లోనక్సలైట్లు రాకేశ్వర్సింగ్ను బందీగా తీసుకెళ్లారు. రాకేశ్వర్సింగ్ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. రాకేశ్వర్సింగ్ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని ఆ సంస్థ కన్వీనర్ ఆచార్య జి.హరగోపాల్, కో కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos