అడల్ట్ మూవీస్ చూశా..

  • In Film
  • June 19, 2019
  • 160 Views
అడల్ట్ మూవీస్ చూశా..

పోర్న్‌ ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి సాధారణ ప్రజలు సైతం కాస్త ఆలోచించి మాట్లాడడానికి తటపటాయిస్తుంటారు. అటువంటిది కోట్లాది మంది ప్రజలు అభిమానించి సినీ తారలు పోర్న్‌ గురించి మాట్లాడడానికి సాహసిస్తారా?అసలు పోర్న్‌ అనే పదమే దగ్గరికి రానివ్వకుండా జాగ్రత్తపడుతుంటారు.అటువంటిది పోర్న్‌ గురించి తన మనసులో మాట చెప్పేసి హీరోయిన్‌ రెజీనా అందరికీ షాకిచ్చారు.ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడిన రెజీనా ఎప్పుడైనా పోర్న్‌ లేదా అడల్ట్‌ ఫిలిమ్స్‌ చూశారా అంటూ ఎదురైన ప్రశ్నకు అవును చూశానంటూ చెప్పిన సమాధానం షాకిచ్చింది.ఈ రోజుల్లో అదంతా అత్యంత సహజమని కూడా వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు.ఇదిలా ఉంటే రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారంటూ సామజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది కాలంగా సన్నిహితంగా ఉంటున్న నటుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రహస్యంగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కానీ రెజీనా మాత్రం మౌనంగానే ఉంది. గతంలో కొందరు హీరోయిన్లు రహస్యంగా వివాహం చేసుకుని ఆ తర్వాత మా పెళ్ళైపోయిందంటూ తీరిగ్గా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో రెజీనా కూడా షాక్ ఇవ్వబోతోందా అని అభిమానుల్లో చర్చ జరుగుతోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos