నా స్నేహితుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులే..

  • In Film
  • June 29, 2019
  • 163 Views
నా స్నేహితుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులే..

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈతరం హీరోయిన్‌ రెజీనా ఏం మాట్లాడినా,ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది.మనసులో ఉన్నది ఏమాత్రం దాచుకోకుండా సూటిగా మాట్లాడుతూ రెజీనా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొద్ది రోజుల క్రితం చిన్నప్పుడే పోర్న్‌ మూవీస్‌ చూశానంటూ వ్యాఖ్యలు చేసిన రెజీనా తాజాగా మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ..తన స్నేహితుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులేనని (లెస్బియన్లు) విషయాన్ని బయటపెట్టి ఆశ్చర్యపరిచారు.అయితే తాను మాత్రం అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉంటానని తెలిపారు. తనకు సంబందించిన ఏ విషయమైనా తాను బాహాటంగానే చెప్పేస్తానని అంటోంది రెజీనా. ఏదీ దాచాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఈ మేరకు తన నిశ్చితార్థం, పెళ్లి విషయాల్లో మీడియా తననే కన్ఫ్యూజన్ లో పడేసిందని అన్నారు. తన నిశ్చితార్థం జరిగితే తానే స్వయంగా చెబుతానని పేర్కొంది.మరోవైపు తాను జయలలిత బయోపిక్ లో నటిస్తోందని సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వార్తలపై కూడా రెజీనా స్పందించారు. జయలలిత బయోపిక్ లో నటించాలని తనను ఎవరూ సంప్రదించలేదని, ఆ సీఈన్మలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. తనకు సంబందించిన వరకు ఏ వార్త ఉన్నా తానే చెబుతానని, అప్పుడు మాత్రమే వాటిని నమ్మండి అని రెజీనా పేర్కొన్నారు.

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos