అరుణాచల్ ప్రదేశ్లో అరుణ బలగాలు

అరుణాచల్ ప్రదేశ్లో అరుణ బలగాలు

న్యూ ఢిల్లీ : చైనా తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో బలగాలను మోహరిస్తోంది. అక్కడ మన సరిహద్దు నిడివి 1,126 కి.మీలు. సరిహద్దు – మెక్ మోహన్ రేఖను చైనా గుర్తించడం లేదు. తమ దేశంలో అంతర్భాగంగానే ఆ రాష్ట్రాన్ని చిత్ర పటాల్లో చూపిస్తోంది. దీనిపై పలుమార్లు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రయోజనం లేదు. తరచూ అరుణాచల్ సరిహద్దుల్లోకి చైనా చొరబాట్లు సాగుతూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్, వాలంగ్ సెక్టార్లలో చైనా కదలికలు ఎక్కువయ్యాయి. అక్కడ చైనా దే పై చేయి. సరిహద్దుల్లో . పెద్ద పెద్ద పర్వతాలు, దట్టమైన అడవులున్నాయి. ఇక్కడ బలగాల మోహరింపు ఖర్చుతో కూడిన పని, పైగా సుదీర్ఘకాలం సైన్యాన్ని సరిహద్దుల్లోనే ఉంచితే యుద్ధ సన్నద్ధత దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలని చైనా ప్రయత్నించే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. యుద్ధం సంభవిస్తే ఇక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి సులభంగా చొరబడొచ్చని భావిస్తుంది. అందుకే సరిహద్దుల్లో భారీగా రహదారులు, వంతెనలు నిర్మించింది. భారత్ ట్యుటింగ్Å పోస్టుకు 15 కి.మీల దూరంలోనే ఆధునిక సదుపాయాలతో చైనా నింగ్చి సైనిక స్థావరం ఉంది. భారత్ పోస్టుల్లో కనీస వసతులు కరువు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos