రవితేజ ఇలా మారిపోయాడేంటబ్బా..

  • In Film
  • August 24, 2019
  • 102 Views
రవితేజ ఇలా మారిపోయాడేంటబ్బా..

ఒకప్పుడు వరుస హిట్‌లతో దూసుకుపోతూ మాస్‌ మహారాజ్‌గా బిరుదు తెచ్చుకున్న రవితేజ కొద్ది కాలంగా సరైన విజయాలు లేక తీవ్రంగా సతమతమవుతున్నాడు.ఈ మధ్య కాలంలో రాజా ది గ్రేట్‌ అంతంమాత్రంగా ఆడగా మిగిలిన సినిమాలన్నీ పేలిపోయాయి.దీంతో తన తదుపరి చిత్రం డిస్కోరాజా కోసం రవితేజ తీవ్రంగా కష్టపడుతున్నట్లు తాజాగా బటయకు వచ్చిన రవితేజ ఫోటో చూస్తే అర్థమవుతోంది.డిస్కో రాజా చిత్రం కోసం లైట్ గెడ్డంతో ఉన్న లుక్ మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది.ఈ ఫోటోలో పదేళ్ల కిందటి రవితేజను చూస్తున్నట్లు ఉందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో రవితేజ కొత్త లుక్‌ కనపడుతుందని సమాచారం. ఆనంద్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రంలో తండ్రీకొడుకుల పాత్రల్లో రవితేజ ద్విపాత్రిభినయం చేయనున్నట్లు తెలుస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos