రాజీనామా బాటలో రావత్‌?

రాజీనామా బాటలో రావత్‌?

న్యూ ఢిల్లీ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ భవితవ్యం చుట్టూ రాజకీయ గందరగోళం మంగళవారం కూడా కొనసాగింది. పదవి నుంచి నుంచి తప్పించే అవకాశాలున్నాయని చ్చిన వార్తల గురించి తనకు తెలియదని రావత్ తెలిపారు. అధిష్ఠానం ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని వివరణ ఇచ్చారు. రాజీనామా చేయడం ద్వారా గౌరవప్రదంగా తప్పుకునే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాల తాజా సమాచారం.రావత్ వ్యవహార శైలి, మంత్రుల నియామక విధానం పట్ల పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండటం సమస్యలకు ప్రధాన కారణం. దీనిపై గత శనివారంనాడు బీజేపీ పరిశీలకుడు రమణ్ సింగ్ పలువురు ఎమ్మెల్యేలతో డెహ్రాడూన్లో సమావేశమయ్యారు. నాయకత్వం మార్పు అవసరంపై కూడా చర్చించారు. అనంతరం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక ఇచ్చారు. దరిమిలా అధిష్ఠానం రావత్ను ఇక్కడకు ను పిలిపించినట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో రాష్ట్ర టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు అజయ్ భట్, మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ఉన్నత విద్యా శాఖ సహాయ మంత్రి ధన్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ భట్ ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos