రామ మందిర నిర్మాణానికి రత్నప్రభ విరాళం

రామ మందిర నిర్మాణానికి రత్నప్రభ విరాళం

బెంగళూరు : అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ అధ్యక్షురాలు రత్నప్రభ రూ.10 వేల విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును రామ మందిరం ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, అయోధ్యలో రామ మందిర నిర్మాణం హిందువుల చిరకాల స్వప్నమని అన్నారు. దీని కోసం దేశంలోని హిందువులందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆ మహోన్నత కార్యక్రమానికి ఉడుతా భక్తిగా…హిందువుగా, ఈ దేశ ప్రతినిధిగా విరాళాన్ని అందించానని వెల్లడించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోది నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చక్కటి పాలనను అందిస్తూ, రామరాజ్యాన్ని తలపిస్తోందని కొనియాడారు. ప్రధాని మోది పాలనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సారథ్యంలో ప్రజలు ప్రశాంత జీవనాన్ని సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం మనందరికీ అత్యవసరమని తెలిపారు. హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో సాగుతున్న రామ మందిర నిర్మాణం ద్వారా సర్వే జనా సుఖినోభవంతు…అంటూ రత్నప్రభ ముక్తాయింపునిచ్చారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos