రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

రాములు నాయక్‌కు సుప్రీంలో ఊరట

ఢిల్లీ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ రాములు నాయక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. తుది తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపవద్దని తెలంగాణ ప్రభుత్వం, మండలి ఛైర్మన్‌కు ఆదేశాలు జారీచేసింది. తనపై అనర్హత వేటు వేస్తూ అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని సమర్థించింది. దీనిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos