కశ్మీర్లో కల్లోలానికి కాంగ్రెస్, ఎన్సీ కారణం

కశ్మీర్లో కల్లోలానికి కాంగ్రెస్, ఎన్సీ కారణం

న్యూ ఢిల్లీ : కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)లే కశ్మీర్లో ఉగ్రవాద బీజాలు వేసాయని భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శనివారం ఇక్కడ ఆరోపించారు. దీన్ని ఆసరాగా తీసుకుని పాక్ రెచ్చిపోయిందన్నారు. ‘భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కశ్మీర్లో కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పాలించింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముమ్మాటికి కారణం వారే. నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్లే సమస్యలు పుట్టుకొచ్చాయ’ని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. 1987లో కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీలు రిగ్గింగ్కు పాల్పడ్డాయని ఆరోపించారు. అప్పుడు చెలరేగిన హింసాత్మక ఘటనలతోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ప్రారంభమ య్యాయని చెప్పారు. కశ్మీర్లో పరిస్థితిని మరింత దిగజార్చి భాజపా రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos