చిదంబరం అరెస్ట్‌పై వర్మ ఏమన్నాడంటే..

చిదంబరం అరెస్ట్‌పై వర్మ ఏమన్నాడంటే..

రాజకీయాల గురించి తెలియదంటూనే రాజకీయాలపై వివాదాస్పద ట్వీట్లు చేయడం దర్శకుడు రామ్‌గోసాల్‌ వర్మ నైజం.ఎన్నికల సమయంలో తన ట్వీట్లతో తెదేపా శ్రేణులకు ఎక్కడో కాలేలా చేసిన వర్మ తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్ట్‌పై తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు.ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో అక్రమాలకు సంబంధించి సీబీఐ బుధవారం అర్ధరాత్రి చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.ఈ విషయంపై స్పందించిన వర్మ చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన కార్యాలయానికే వెళ్లారని కామెంట్ చేశారు.నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కీర్తించిన వర్మ.. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని కొనియాడారు. ట్విట్టర్ ద్వారా చిదంబరంపై తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు. చిదంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి నిదర్శనమని.. ఆయన అరెస్ట్ లో ప్రత్యేకత ఉందని అన్నారు.కేంద్ర హోంమంత్రి హోదాలో సీబీఐ కేంద్రకార్యాలయాన్ని ప్రారంభించింది ఆయనేనని.. ఇప్పుడు అదే కార్యాలయంలో కస్టడీలో ఉన్నారని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నరేంద్రమోదీ ఇండియా మరోసారి నిరూపించిందని ట్వీట్‌ చేశారు.ఆర్జీవీ ట్వీట్పై నెజిటన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos