ఇమ్రాన్ఖాన్ పై ఆర్జీవీ ట్విట్ అటాక్…

  • In Film
  • February 21, 2019
  • 121 Views
ఇమ్రాన్ఖాన్ పై ఆర్జీవీ ట్విట్ అటాక్…

గత గురువారం పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల
దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఉగ్రవాద సంస్థలతో
పాటు వాటికి ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్‌ను మరోసారి భారత్‌వైపు కన్నెత్తి చూడకుండా సమాధానమివ్వాలంటూ
ప్రజల నుంచి డిమాండ్లు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి.ఈ క్రమంలో తరచూ సామాజిక మాధ్యమాల్లో,ప్రసార
మాధ్యమాల్లో ఏదోఒక వివాదంతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈసారి పాక్‌ ప్రధాని
ఇమ్రాన్‌ఖాన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సంధించారు.ఈ విమర్శలు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు
చేరాయో లేదో తెలియదు కానీ రామ్‌గోపాల్‌ వర్మ అభిమానులు మాత్రం పాక్ ప్రధానిపై ఆర్జీవీ సర్జికల్ స్ట్రైక్స్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.
–  ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్..  సమస్యలు ఒక్కమాటతో పరిష్కారమైతే.. మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్ డీఎక్స్ తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మొద్దు భారతీయులకు నేర్పించండి.. కావాలంటే మీకు ట్యూషన్ ఫీజు కూడా ఇస్తాము.
 
–  ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఒసామాలాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని ఆమెరికాకు తెలుస్తుంది.. కానీ మీకు తెలియదు. మరి మీది అసలు దేశమేనా? చెప్పండి సార్ ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు. మాకు కొంచం తెలివితేటలు నేర్పిపించండి.
 
–  ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్ లష్కర్-ఏ-తొయిబా తాలిబన్ అల్-ఖయిదా మీ ప్లే స్టేషన్లు అని నాకెవరూ చెప్పలేదు. కానీ మీరు కూడా వాటిపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదు.
 –  ప్రియమైన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. జేష్-ఏ-మహ్మద్ లష్కర్-ఏ-తొయిబా తాలిబన్ అల్-ఖయిదాలను మీరు బాల్స్ గా  భావించి.. పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ.. ఇండియా పెవిలియన్లోకి పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా.. లేదా బాంబ్స్ అనుకుంటున్నారా.. కాస్త చెప్పండి సార్?

తాజా సమాచారం

Latest Posts

Featured Videos