ఏచూరిపై రాందేవ్‌ ఫిర్యాదు

ఏచూరిపై రాందేవ్‌ ఫిర్యాదు

హరిద్వార్‌:రామాయణం, మహాభారతాలు హింసమయమని వ్యాఖ్యానించిన
 సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిపై చర్యలు తీసుకోవాలని రాందేవ్‌ బాబా
శనివారం  ఉత్తరాఖండ్, హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు
చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణ, మహా భారతాలను ఏచూరి అవమానించారని
అందులో  పేర్కొన్నారు.తర్వాత విలేఖరులతో మాట్లాడారు.
‘మన పూర్వీకులను అవమానించిన ఏచూరిపై ఫిర్యాదు చేశాం. ఇది ముమ్మాటికీ క్షమించదగినది
కాదు. కటకటాల వెనక్కి ఆయన వెళ్లాల్సిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్
చేశాం’ అని చెప్పారు.  రాందేవ్ బాబా వెంట  పలువురు సాధువులు కూడా ఉన్నారు. హిందూ మతం
హింసకు అతీతమైనది కాదని ఏచూరి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రామాయణ, మహాభారతాల్లో
ఉన్నదంతా హింసేనని అన్నారు. హిందుమతం హింసకు అతీతమైందని భోపాల్‌ భాజపా
అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యకు ఆయన ఆ మేరకు స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos