10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం

10 వేల మెగావాట్ల  సౌర విద్యుత్ కేంద్రం

అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థ -జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. సమావేశం తర్వాత తీర్మానాల్ని సమాచార మంత్రి పేర్ని నాని విలేఖరులకు వివరించారు. వచ్చే మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిని వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరిం చారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసు కుంటామని భరోసా ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయటంతో బాటు గరిష్టంగా మూడేళ్ళ వరకు కారాగార శిక్ష పడే లా చర్యలు తీసుకుంటామని వివరించారు. పంచాయతీ ఎన్నికలకు ఐదు రోజులు మాత్రమే ప్రచారాన్ని నిర్వహిం చాలని ఆంక్షల్ని విధిం చా మని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచార వ్యవధి ఎనిమిది రోజులు. రాష్ట్ర వ్యవసాయ మండలి, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏర్పాటుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపిందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos