విదేశీయులు గృహ హింస కేసు పెట్టొచ్చు

విదేశీయులు గృహ హింస కేసు పెట్టొచ్చు

జోధ్పూర్ : భారత దేశంలో గృహ హింస బాధితులైన విదేశీ జాతీయులు గృహ హింస చట్టం ప్రకారం ఫిర్యాదు చేయ వచ్చునని, ఇది వారి హక్కు అని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. తాము విదేశీ జాతీయులమైనందున తనకు వ్యతిరేకంగా భార్య-కేథరిన్ నెయిద్దు చేసిన ఫిర్యాదుకు విచారణార్హత లేదని భర్త-రొబర్టో నెయిద్దు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఇద్దరూ జోధ్పూర్లో నివసిస్తున్నారు. . కేథరిన్ తన భర్త రొబర్టోపై 2019లో ఫిర్యాదు చేశారు. దీన్ని రొబర్టో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో, మహిళలపై దురాగతాల కేసుల విచారణ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ రెండు న్యాయస్థానాలు రొబర్టో వాదనను తోసి పుచ్చాయి. అనంతరం రొబర్టో హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరమూ భారత దేశ పౌరులం కాదని, తాము భారత దేశ అధికార పరిధికి లోబడిన వారము కాదని వాదించారు. ప్రతివాది కేథరిన్ తరపు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, గృహ హింస నిరోధక చట్టం, 2005లోని సెక్షన్ 2(ఏ) ప్రకారం ‘బాధిత వ్యక్తి నిర్వచనం పరిధిలోకి ఇటువంటి హింసకు గురయ్యే విదేశీ పౌరులు కూడా వస్తారని తెలిపారు. విచారణ న్యాయస్థానానికి దరఖాస్తు చేసే హక్కు విదేశీ పౌరులకు ఉందన్నారు. దీన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కుమార్ మాథుర్ కూడా సమర్థించారు. కేథరిన్ పిటిషన్ను తిరస్కరించాలని రొబర్టో చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. రొబర్టో దాదాపు 25 ఏళ్ళపాటు జోధ్పూర్లో నివసించేవారని, ఆ తర్వాత కేథరిన్ను వివాహం చేసుకు న్నారని గుర్తించారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు సంబం ధించిన సంఘటన కూడా జోధ్పూర్లోనే జరిగిందని గమనిం చారు. గృహ హింస నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న నిర్వచనాల ప్రకారం, కేథరిన్ ఫిర్యాదుకు విచారణార్హత ఉందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం భారత దేశ పౌరులకు మాత్రమే కాకుండా ఈ దేశానికి చెందని వారికీ రక్షణ లభిస్తుందని చెప్పారు. కేథరిన్కు రక్షణ పొందే హక్కు ఉందని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos