ప్రమాదంపై రాజ్‌తరుణ్‌ క్లారిటీ..

  • In Film
  • August 21, 2019
  • 147 Views
ప్రమాదంపై రాజ్‌తరుణ్‌ క్లారిటీ..

ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద జరిగిన కారు ప్రమాదంపై యువ హీరో రాజ్‌తరుణ్‌ స్పందించారు. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన కారు గోడను ఢీకొట్టగా అనంతరం కారులోని వ్యక్తి వెంటనే కారు దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయినట్లు పోలీసులు సిసి టివి ఫుటేజ్ ద్వారా కనుగొన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో,ప్రసార మాధ్యమాల్లో ఒక్కో రకంగా వార్తలు వస్తుండడంతో రాజ్ తరుణ్ సామాజిక మాధ్యమాల ద్వారా వివరణ ఇచ్చారు.నేను సురక్షితంగా ఉన్నాను. నేను ప్రయాణిస్తున్నప్పుడు ఊహించని విధంగా మలుపు దగ్గర కుడివైపుకు తిరగాల్సి వచ్చింది. దాంతో కారు రోడ్డు పక్కన ఉన్న గోడను డీ కొట్టింది. శబ్దానికి కి వెంటనే నా చెవులు బ్లాక్ అయ్యాయి. ఏమి అర్ధం కాలేదు. సీటు బెల్టు పెట్టుకోవడంతో నేను క్షేమంగా బయటపడ్డాను.సహాయంకోసం వెంటనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగింది ఇదే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాను” అంటూ త్వరలో మళ్ళీ షూటింగ్ కి వెళ్లనున్నట్లు రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos