తుపాను ముప్పు తప్పింది కానీ…

తుపాను ముప్పు తప్పింది కానీ…

అమరావతి: బంగాళాఖాతంలో పరిస్థితులు సహకరించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. కానీ.. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ప్రభావం ఉంటుంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర స్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది.
అనంతరం.. తీవ్ర వాయుగుండంగా బలపడుతూ ఈ నెల 18 నాటికి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్–తమిళనాడు తీరాలకు సమీపించనుంది. ఇది తుపానుగా మారకుండా తీవ్ర వాయుగుండం లేదా వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos