మోదీ ‘మాఫీవీర్’

న్యూ ఢిల్లీ: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం ప్రధాని మోదీ సర్కార్ పై ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. ఆ పథకాన్ని ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ‘మాఫీవీర్’గా మారి.. యువత డిమాండ్కు తలొగ్గుతారు. గత ఎనిమిదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ విలువలను అవమానపరిచింది. సాగు చట్టాలను ప్రధాని రద్దు చేసుకోక తప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాల్సిందే” అని పేర్కొన్నారు. అగ్నిపథ్కు వ్యకతిరేకంగా ఆదివారం -జూన్ 19న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని నిర్ణయించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. నిరసనలు చేపడు తున్న యువకులకు సంఘీ భావంగా సత్యా గ్రహం చేయను న్నట్టు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos