అనుమతి నిరాకరించినా లఖింపూర్‌కు రాహుల్

అనుమతి నిరాకరించినా లఖింపూర్‌కు రాహుల్

లక్నో: హింసాత్మక ఘటనలు సంభవించిన లఖింపూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. రైతులకు సంఘీ భావం తెలిపేందుకు ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందంతో రాహుల్ వస్తున్నందున ఆయనను అనుమతించాలని కాంగ్రెస్ పార్టీ  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి లేఖ రాసింది.  నిషేధాజ్ఞల పేరుతో యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా  రాహుల్ యథా ప్రకారం లఖింపూర్‌ జిల్లాలో తన పర్యటన సాగించ నున్నారు.ఆయనతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్ని, పార్టీ నేత కేసీ వేణు గోపాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఉంటారు. వీరంతా మధ్యాహ్నం 1.30 గంటలకు లక్నో చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos