కరోనా మూడో దాడిని ఇలా ఎదుర్కోండి

కరోనా మూడో దాడిని ఇలా ఎదుర్కోండి

న్యూఢిల్లీ: కరోనాపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళ వారం విలేఖరుల వర్చువల్ సమావేశంలో విడుదల చేసారు. ‘ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఈ పత్రం విడుదల చేయడం లేదు. మూడో దాడిని దేశం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇది సహకరిస్తుంది. ఇదొక నీలి నక్ష అని చెప్పారు. తొలి, రెండో విడత కోవిడ్ నివారణ చర్యల్లో లోపం వలల భారీ విపత్తు ఏర్పడిందనేది చాలా స్పష్టం. దీనికి కారణం ఏమిటో, ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాం. వైరస్ ఉత్పరివర్తనం మ్యుటేట్ అవుతున్నందున మూడో దాడి తర్వాతా మరిన్ని దాడులు ఉండొచ్చు. సోమవారం రికార్డు స్థాయిలో టీకాలు ఇవ్వడం సంతోషకరం. అయితే ఇది తూతూ మంత్రం కాకూడదు. ఏదో ఒక్క రోజుకు పరిమితం కాకుండా యావత్ జనాభాకు వ్యాక్సినేషన్ ఇచ్చేంతవరకూ ఈ తరహా పని తీరు చూపించాలి. కరోనా మూడో దాడి ఎలా ఎదుర్కోవాలో నిపుణులతో చర్చించి, శ్వేతపత్రంలో సూచనలు చేసాం. టీకాలు అన్నింటి కంటే చాలా ముఖ్యం. చాలా వేగంగా టీకాలు వేసి 100 శాతం పూర్తి చేయాలి. ఆసుపత్రులు, ఆక్సిజన్, పడకలు, ఇలా అవసరమైన వాటన్నంటినీ ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేయాలి’అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos