భాజపాది విభజన రాజకీయాలు

భాజపాది విభజన రాజకీయాలు

కోల్కతా : ‘బిజెపి, టిఎంసి రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటే. విభజన రాజకీయాలకు పాల్పతాయ’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గోల్ ఫోఖోర్లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో విమర్శించారు. ‘ఎనిమిది దశల పోలింగ్లో నాలుగుదశలు ముగిశాయి. అయినా బిజెపికి గెలిచే అవకాశం లేదు. మీరు తృణమూల్కు అవకాశం ఇచ్చారు. అది విఫలమైంది, మమతా బెనర్జీ రోడ్లు, కళాశాలలను నిర్మించారు. ఉద్యోగాల కోసం లంచాలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు కావాలంటే లంచాలు చెల్లిం చాల్సిన ఏకైక రాష్ట్రం ఇదే. . కాంగ్రెస్ ముక్తి భారత్ అని బిజెపి ప్రచారం చేస్తోంది. అయితే తృణమూల్ ముక్తి భారత్ అని ప్రచారం చేపట్టలేదు. దీని ఆంతర్యం ఏమిటి? బిజెపి, ఆర్ఎ స్ఎ స్లతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోము. రాజకీయంగానే కాదు. సిద్ధాంతాల పరంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వైరుధ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ రాజకీ యంగా బిజెపిపై పోరాటం చేస్తున్నారు. గతంలో రెండు పార్టీలు మిత్రులే. అటల్బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో మమతా బెనర్జీ మంత్రిగా పని చేశారు. బెంగాల్ సంస్కృ తి, వారసత్వాన్ని బిజెపి నాశనం చేస్తోంది. ద్వేషం, హింస, విభజన రాజకీయాలకు పాల్పడుతోంది. బెంగాల్ను బంగారు బెంగాల్గా పిలుస్తారు. ప్రజలు కులం, మతం, భాషల ఆధారంగా ఇతర రాష్ట్రాలను విభజిస్తున్నారు. తమిళనాడులో, అస్సాంలో ఇదే విధంగా విభజన రాజకీయాలు చేస్తున్నార’ని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos