బిలియ‌నీర్ దోస్తుల‌కు ప్ర‌ధాని 16 ల‌క్ష‌ల కోట్ల రుణ‌మాఫీ చేశారు

బిలియ‌నీర్ దోస్తుల‌కు ప్ర‌ధాని 16 ల‌క్ష‌ల కోట్ల రుణ‌మాఫీ చేశారు

న్యూ ఢిల్లీ : బిలియనీర్ మిత్రులకు ప్రధాని మోదీ సుమారు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ నేరానికి పాల్పడిన ప్రధాని మోదీని ఈ దేశం ఎన్నటికీ క్షమించదు అని ఆయన అన్నారు. తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ హిందీలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. 16 లక్షల కోట్ల మొత్తాన్ని భారతీయుల బాధలను తీర్చేందుకు వాడేవాళ్లమన్నారు. కానీ అదానీ లాంటి వాళ్లను ఆ డబ్బును ఖర్చు చేసినట్లు ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ తన సంపన్న మిత్రుల కోసం 16 లక్షల కోట్ల రుణాన్ని రద్దు చేశారని, అంత మొత్తం డబ్బుతో 16 కోట్ల యువతకు ఉద్యోగం కల్పించేవాళ్లమని రాహుల్ అన్నారు. ప్రతి ఏడాది ఆ 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమన్నారు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాది లక్ష ఇవ్వడం వల్ల వాళ్ల జీవితాలు మారేవన్నారు. 10 కోట్ల మంది రైతులను రుణాలను రద్దు చేస్తే .. లెక్కపెట్టలేనన్ని సంఖ్యలో ఆత్మహత్యలను ఆపేవాళ్లమన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు దాదాపు రూ.400కే గ్యాస్ సిలిండర్లను యావత్ దేశానికి అందించనున్నట్లు తెలిపారు. భారతీయ ఆర్మీకి చెందిన మూడేళ్ల ఖర్చును ఆ డబ్బుతో తీర్చేవాళ్లమన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ప్రజలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించవచ్చునని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos